మస్క్ అయితే ఏంటి.. అది తప్పే : సునాక్
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం వేళ ఎక్స్ వేదికగా పెట్టిన యూదు వ్యతిరేక పోస్టులకు ఎలాన్ మస్క్ మద్దతు పలకడం తప్పేనని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పష్టం చేశారు. నేను చాలా మందితో చర్చలు జరుపుతా. అయితే వారి వ్యక్తిగత అభిప్రాయాలపై నేను దృష్టి సారించాలనుకోవడం లేదు. వాస్తవానికి నేను యూదు వ్యతిరేకతను అసహ్యించుకుంటా. అది ఎలాన్ మస్క్ అయినా సరే. వీధుల్లో ఉండే వ్యక్తి అయినా సరే. ఇతరులను దుర్భాషలాడటం తప్పే. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా సరే అది పూర్తిగా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా అని అన్నారు.













