ప్రతిష్టాతకమైన పులిట్జర్ పురస్కారాల… జాబితా విడుదల

ప్రతిష్ఠాత్మక పులిట్జర్ బహుమతిని అమెరికా పత్రిక స్టార్ ట్రిబ్యూన్ గెలుచుకుంది. గతేడాది మేలో జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య ఘటనను వివరిస్తూ ఇచ్చిన కథనాలకు గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు పులిట్జర్ బోర్డు ప్రకటించింది. అసోసియేటెడ్ ప్రెస్‍కు చెందిన ఇద్దరు ఫొటోగ్రాఫర్లు ఎమిలో మోరెనాటి, జులియో కార్టెజ్ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఫ్లాయిడ్ హత్యానంతర నిరసనల దృశ్యాలను, ప్రజల జీవితాల్లో కరోనా వైరస్ నింపిన విషాదాన్ని తమ కెమేరాల్లో బంధించినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. మోకాలితో మెడపై నొక్కుతూ జార్జి ఫ్లాయిడ్‍ను కర్కశంగా పోలీస్ చంపివేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించిన ఒక యువకుడు డార్నేల్లా ఫ్రేజియర్‍కు పులిట్జర్ ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని ప్రకటించింది. కొవిడ్ మమమ్మారిపై లోతైన, సవివర కథనాలకు అందించిన న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ప్రజా సేవ విభాగంలో అవార్డు దక్కింది.