మిస్ వరల్డ్ అమెరికాగా శ్రీ శైనీ
ఇండియన్ అమెరికన్ శ్రీ శైనీ మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచింది. బ్యూటీ అవార్డును నెగ్గిన తొలి ఇండియన్ అమెరికన్ యువతిగా రికార్డులెక్కింది. వాషింగ్టన్ స్టేట్‌కు చెందిన ఆమెకు ఈ సందర్భంగా డయానా హెడెన్ కిరీటం పెట్టారు. లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా మెడ్క్వార్టర్స్లో ఈ కాంపిటిషన్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శైనీ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. మొదట చాలా భయపడ్డాను. ఈ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే దక్కుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ నా వెంటనే నిలిచిన మా అమ్మకు, థ్యాంక్యూ మిస్ వరల్డ్ అమెరికా అని చెప్పింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్, తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌తో తెలిపింది.













