జో బైడెన్ మనవరాలి కారుపై దాడి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బైడెన్ ప్రయాణించిన ఓ కారుపై రాజధాని వాషింగ్టన్లో ముగ్గురు దుండగులు దాడికి తెగబడ్డారు. వెంటనే గమనించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. అయితే కారులో బైడెన్ మనవరాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నవోమీ బైడెన్ భద్రతా సిబ్బందితో కలిసి జార్జిటౌన్ ప్రాంతానికి వెళ్లారు. ఆమె కారు దిగాక ఒకచోట పార్కు చేశారు. ఈ సమయంలో ముగ్గురు దుండగులు కారు అద్దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో దుండగులు ఎరుపు రంగు కారులో పరారయ్యారు. కాల్పులో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.













