రష్యాలో కొత్త చట్టం… ఇక జైలుకు వెళ్లే అవకాశం
ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారన్ని వ్యాప్తి చేసేవారు ఇక జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రష్యా బోగస్ కథనాలుగా గుర్తించి వాటిని రాసిన, ప్రసారం చేసినవారికి గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఓ ముసాయిదా చట్టాన్ని రష్యా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీన్ని అధ్యక్షుడు పుతిన్ ఆమోదిస్తే చట్టమవుతుంది. ఈ ప్రక్రియ ఒక్క రోజులోనే పూర్తయే అవకాశం ఉన్నట్లు దిగువసభ స్పీకర్ తెలిపారు. దేశ సైనికులను, అధికారులను విశ్వసనీయతను కాపాడేందుకు ఈ చట్టం తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా స్వతంత్ర మీడియాను, రష్యాపై వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికి ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.













