600 రోజులు అయినా.. కొనసాగుతున్న హోరాహోరీ పోరు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించి 600 రోజులు అయినా ఇరు పక్షాల్లో ఇంకా ఎవరూ పైచేయి సాధించలేదు. హోరాహోరీ పోరు సాగుతూనే ఉంది. రష్యా దళాలు ఆశించిన స్థాయిలో వేగంగా ముందుకు కదలడం లేదు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం పరిస్థితి కూడా దాదాపు అంతే. తూర్పు ప్రాంతంలోని ఆవిద్విక్ నగరాన్ని చుట్టుముట్టేందుకు మాస్కో చేసిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టామని కీవ్ పేర్కొంది. మరోవైపు 4 నెలల క్రితం రష్యాపై ఎదురుదాడి ప్రారంభించిన ఉక్రెయిన్ మాస్కో రక్షణశ్రేణిని దాటలేకపోతోంది. ఆరంభంలో కొన్ని విజయాలు సాధించినా, ఆ తర్వాత పురోగతి లేదు.













