యూకే విదేశాంగ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం పదేళ్లపాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడిలో పుతిన్ విజయం సాధిస్తే, ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు ఐరోపా సిద్ధంగా ఉండాలని లిజ్ ట్రస్ హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్ర దేశాలు రష్యాను ఉక్రెయిన్ నుంచి వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభం వేళ, అంతర్జాతీయ భద్రత విషయంలో మార్పులు తెచ్చేలా ముందుకు కదలాలన్నారు. ప్రపంచ నికర సంపదలో 50 శాతానికి పైగా వాటా ఉన్న జీ7 దేశాలు దురాక్రమణ దారుల్ని అడ్డుకొనే అంశంలో కీలకంగా వ్యవహరించాలన్నారు.













