మిత్రదేశాలు ఇన్వెస్ట్ చేయకుంటే కష్టమే… వచ్చే ఏడాదికి
ఉక్రెయిన్‌తో ఏడాది నుంచి యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఖజానా వచ్చే ఏడాదికి ఖాళీ అవుతుందని ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒలెజ్ డెరిపస్కా వెల్లడించారు. మిత్ర దేశాల నుంచి పెట్టుబడులు వస్తేనే పుతిన్ సర్కారు ఈ గండం నుంచి గట్టెకుతుందన్నారు. సైబీరియాలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రష్యాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, కలలు కడనం మానాలని పుతిన్ ప్రభుత్వానికి హితవు పలికారు. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని, వ్యాపారులు నిరాశలో ఉన్నారని అన్నారు. దేశంలో నిధులు తగ్గిపోతున్నాయని, ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను కిందకు దిగజార్చే ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు.













