బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్!
బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో ఓటమి పాలైన భారత సంతతి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునక్ మరోసారి ప్రధాని ఎన్నికలు జరిగితే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. 25 శాతం ఓట్లు లిజ్‌ట్రస్‌కు, 55 శాతం ఓట్లు సునక్ సాధిస్తారని సర్వే నివేదిక ప్రకటించింది. కనర్జ్వేటివ్ పార్టీ ఎంపీలు భవిష్యత్ ప్రధానిగా సునక్‌ను భావిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. కన్జర్వేటివ్ పార్టీలో 55 శాతం సభ్యులు ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాకు డిమాండ్ చేశారని, కేవలం 38 శాతం మాత్రమే ఆమె కొనసాగాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. 15 శాతం మంది ట్రస్ పనితీరుకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవి రిషి సునక్ చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ సర్వే నివేదిక పేర్కొంది. బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నికల ఈ నెల 28న ఎన్నిక జరగనుంది.













