రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య … తొలిసారి మాటల యుద్ధం
బ్రిటన్లో ప్రధాన మంత్రి పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తొలిసారిగా జరిగిన టీవీ చర్చ హోరాహోరీగా సాగింది. ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా బాట్లాడారన్న దానిపై ఒపీనియం సంస్థ ఒక పోల్ నిర్వహించింది. అందులో సునాక్కు 39 శాతం ఓట్లు రాగా ట్రస్ 38 శాతం మంది మొగ్గారు. మొత్తం మీద చూసినప్పుడు ఓటర్లు విస్పష్టంగా ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. సర్వేలో పాల్గొన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో 47 శాతం మంది మాత్రం ట్రస్ బాగా మాట్లాడారని పేర్కొన్నారు. 38 శాతం మంది సునాక్ వైపు మొగ్గు చూపారు.













