బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ కు… వచ్చే ఏడాది

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ ను వచ్చే ఏడాది జూలై 30వ తేదీన వివాహం చేసుకోనున్నారు. 56 ఏండ్ల బోరిస్ జాన్సన్ 2019లో 33 ఏండ్ల క్యారీ సైమండ్స్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డౌనింగ్ స్ట్రీట్‍లో నివసిస్తున్నారు. వీరికి విల్ఫ్రెడ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. వచ్చే ఏడాది జూలై 30న అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు.
భారతీయ సంతతికి చెందిన న్యాయవాది మెరీనా వీలర్, బోరిస్ జాన్సన్ గత ఏడాది విడాకులు తీసుకున్నారు. వచ్చే ఏడాది పెండ్లి వేడుక కోసం ఎదురు చూస్తున్నట్లు అతడి కుటుంబ స్నేహితులు అంటున్నారు. పెండ్లి ఎక్కడ జరుగుతుందో ఇంకా వెల్లడికాలేదు. కరోనా కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న వారిలో ప్రపంచంలోనే ప్రజలందరిలాగే బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు.