ప్రధాని మోదీ జెలెన్స్కీ భేటీ
జపాన్లో జరుగుతోన్న జీ7 సదస్సు క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు ప్రతక్ష్యంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఉక్రెయిన్`రష్యా వివాదంపై మోదీ, జెలెన్స్కీలు ఇప్పటికే పలుమార్లు ఫోన్లో, వర్చువల్గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మొదటి నుంచి తటస్థ వైఖరి అవంబిస్తోన్న భారత్ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని ఉద్ఘాటించింది.













