ప్రధాని మోదీ అపురూప గౌరవం.. అకాశంలో
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి అపురూప గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయిన సందర్భంగా ఒక విమానం భారత ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఫొటోలతో ఉన్న భారీ బ్యానర్ తో న్యూయార్క్ గగనతలంలో విహరించింది. మోదీ అమెరికాలో పర్యటించినందుకు గుర్తుగా ఇరుదేశాల నేతలు చిత్రాలు అకాశంలో మెరిశాయి. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్లో పోస్టు చేశారు. ఈ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా రెండు దేశాల నడుమ అనేక ఒప్పందాలు జరిగాయి. ఇక నేడు అమెరికాలో పర్యటనను ముగించుకున్న మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఈజిప్ట్‌కు బయలుదేరి వెళ్లారు.













