సుందర్ పిచాయ్ తో ప్రధాని మోడీ చర్చ
భారత్‌లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను స్థాపించాలనే కంపెనీ ప్రణాళికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌లో హెచ్పీతో కలిసి క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రధాన మంత్రి అభినందించారని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇండియాలో హెచ్పీతో కలిసి గూగుల్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం మన దేశంలో ఎలక్ట్రినిక్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో అతి పెద్ద ప్రోత్సహకరమైన విషయమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రోమ్‌బుక్‌ను చెన్నయ్ సమీపం లోని ప్లాంట్‌లో అక్టోబర్ 2 నుంచి తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ బుక్స్ ప్రధానంగా విద్యా సంస్థల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు.













