మనీలాండరింగ్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా.. భారత్ పోరాటం
నగదు అక్రమ చెలామణీ, ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పోషిస్తున్న పాత్రను ఆమె అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశానికి కూడా నిర్వహించారు. దీనికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలోనే పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు ఆమెదం తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ అంతర్ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్, ఇతర సమస్యలపై పోరాడటమే ఈ సంస్థ ఎజెండా. ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సీతారామన్ మద్దతు పలికారు. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, సామూహిక హననానికి దారి తీసే ఆయుధాలకు ఫైనాన్సింగ్కు అడ్డుకోవడం కోసం ప్రపంచకూటమిటి ఎఫ్ఏటీఎఫ్ చేస్తున్న కృషికి వనరులకు సమకూరుస్తామన్నారు.













