చిలీలో వెలుగు చూసిన కొత్త వైరస్
దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి నరాలు పనిచేయకుండా మొత్త కండరాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. ఇది పక్షవాతానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. అయితే దీనికి ఇప్పటివరకు చికిత్స లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలుపోని చిలీ ప్రభుత్వం మూడు నెలలు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గిలాన్ బరే సిండ్రోమ్, జిబిఎస్ అనే అత్యంత అరుదైన సిండ్రోమ్ ఇది. ఈ కొత్త వింత వ్యాధితో చిలీవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఈ కొత్త వైరస్ ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి, నరాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని గుర్తించారు. దీని కారణంగా శరీరంలోని కండరాల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని దాని వల్ల విపరీతమైన అలసట, సత్తువ లేకపోవటం, ఒంట్లోని అవయవాలు మొద్దుబారడం జరుగుతుందని పేర్కొన్నారు.













