50 ఏండ్లలో మొదటిసారి ఇదే.. మాజీ ఎంపీతో సహా
మయన్మార్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న సైన్యం ఓ మాజీ ఎంపీతో సహా నలుగురు ప్రజాస్వామ్య కార్యకర్తలను ఉరితీసింది. సైనిక పాలనలో వీరు హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష అమలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఉరిశిక్ష పడిన వారిలో మయన్నార్ నేత ఆంగ్‌సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి చెందిన పియో జీయో థావ్, ప్రజాస్వామ్య ఉద్యమకారులు క్యామిస్ యూ, హులా మియో ఆంగ్, ఆంగ్ థురా జా ఉన్నారు. కాగా, దాదాపు గత 50 ఏండ్లలో మయన్నార్‌లో ఉరిశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సైన్యానికి వ్యతిరేకంగా మిలీషియా గ్రూపునకు ఈ నలుగురు సహకరించారని సైనిక ప్రభుత్వం ఆరోపణ.













