అమెరికాలో టిక్ టాక్ చిట్కాలతో .. నెలకు రూ.కోటికిపైనే ఆదాయం
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ గురించి చిట్కాలు, మెలకువలు చెబుతూ అమెరికా యువతి ఒకరు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌కు చెందిన కేట్ నోర్టన్ అనే 27 ఏళ్ల యువతి టిక్ టాక్, ఇన్స్ట్రాగ్రామ్లలో ఆన్లైన్ క్లాస్‌లు బోధిస్తూ నెలకు రూ.కోటికి పైనే సంపాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త బోరింగ్‌గా అనిపించే ఎక్సెల్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్‌పై పాఠాలు చెప్పేందుకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం కేట్ వదులుకున్నారు. టిక్ టాక్‌లో ఆమె ఖాతా ప్రారంభించారు.
గతేడాది నవంబరులో ఆన్లైన్ టీచింగ్ బిజినెస్ మొదలుపెట్టారు. సరదాగా నృత్యం చేస్తూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి ఆసక్తికరంగా పాఠాలు చెప్పేవారు. పూరిత వినోదాత్మకంగా సాగే ఈ తరగతులకు హాజరయ్యే వారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 2021లో ఏప్రిల్ నాటికి నెలకు రూ.కోటి ఆదాయం అందుకున్నారు. కేట్ ప్రియుడు సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమెకు సాయం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఎక్సెల్, గూగుల్ షీట్స్‌పై పూర్తిస్థాయి శిక్షకురాలిగా మాత్రమే కాకుండా, ఇతర ఆన్లైన్ ప్రొడక్ట్స్ కోర్స్‌లను బోధిస్తూ కేట్ చేతినిండా సంపాదిస్తున్నారు.













