అమెరికాలో ఓ వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష
పిజ్జా తయారుచేసేందుకు సిద్ధం చేసిన తడి పిండిలో రేజర్ బ్లేడ్లు, నట్లు ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. నికోలస్ మిషెల్(39) అనే వ్యక్తి మెయినీ, న్యూ హ్యాంప్షైర్లలోని సూపర్మార్కెట్లలో పిజ్జా పిండిలో రేజర్ బ్లేడ్లు, నట్లు ఉంచాడు. ఇందుకు సంబంధించి 2020లో అసెస్టయ్యాడు. ఈ మేరకు తనపై మోపిన రెండు కౌంట్లలో ఒక దాన్ని జూన్ నెలలో అంగీకరించాడు. ఈ క్రమంలో న్యాయమూర్తి తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అదే సమయంలో నికోలస్ హన్నాఫోర్డ్ సూపర్ మార్కెట్లకు 2.30 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.













