భారత సంతతి వ్యక్తికి.. అరుదైన గౌరవం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆయా దేశాల్లో మంచి పదవులు లభిస్తున్నాయి. తాజాగా కెనడాలో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్‍లోని లుథియానా ప్రాంతానికి చెందిన అంగద్ సింగ్ ధిల్లాన్.. కెనడాలోని ఫెడరల్ గవర్నమెంట్‍కు సంబంధించిన రవాణా మంత్రిత్వశాఖలో డైరెక్టర్‍గా నియమితులయ్యారు. న్యూ బ్రున్స్విక్‍లోని మౌంట్ అల్లిసన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 2015లో లిబరల్ పార్టీలో చేరారు. కాగా రవాణా మంత్రిత్వశాఖలో డైరెక్టర్‍గా నియమకం అవడం పట్ల అంగద్ సింగ్ ధిల్లాస్ సంతోషం వ్యక్తం చేశారు.