బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడిరది. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. నేడు వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్ ట్రస్ విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చాయి. సర్వేలు చెప్పినట్టుగానే సునాక్‌పై లిజ్ ట్రస్ గెలుపొందారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా ఆమె రికార్డు సృష్టించారు.













