మిగతా దేశాలు కూడా ఇదే పని : అమెరికా
2050 కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలకు అమెరికా, చైనా పదును పెట్టుకుంటాయని అమెరికా ప్రతినిధి జాన్ కెర్రీ తెలిపారు. మిగతా దేశాలు కూడా ఇదే పని చేయాలని సలహా ఇచ్చారు. శిలాజ ఇంధనాల గురించి ప్రస్తావించినంత మాత్రాన పని జరగదనీ, ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారడానికి కావలసిన నిధులను పేద దేశాలకు అందించడం ముఖ్యమని దక్షిణాసియా వాతావరణ కార్యాచరణ నెట్వర్క్ డైరెక్టర్ సంజయ్ వశిష్ఠ్ పేర్కొన్నారు. పారిస్ సదస్సు తీర్మానించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి కర్బన ఉద్గారాలను వేగంగా, స్థిరంగా, విస్తృతంగా తగ్గించాలని దుబాయ్ ప్రకటన పిలుపునిచ్చింది.













