సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి
జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడింది. మాకో, కొమురో వివాహ పత్రాన్ని పాలెస్ అధికారులు సమర్పించినట్లు ఇంపీరియల్ హౌజ్హోల్డ్ ఏజెన్సీ వెల్లడిరచింది. వివాహానికి సంబంధించి ఎలాంటి విందులు, ఆచారాలు ఉండవని వెల్లడిరచింది. కాలేజీలో చదువుతున్న సమయంలో కొమురోతో మాకోకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమంగా మారింది. 2017లో తమ ప్రేమ విషయాన్ని మాకో అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది సెప్టెంబర్లో మాకో, కొమురోకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇంపీరియల్ హోజ్ హోల్ట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. 2018, నవంబర్లో వీరిద్దరి వివాహం జరుగుతుందని తెలిపింది. అయితే మాకో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తతడంతో ఆ పెళ్లి కాస్త 2020కు వాయిదా పడి చివరకు ఇప్పుడు వివాహం పూర్తయింది. జపాన్ యువరాణులు సామాన్య కుటుంబానికి చెందిన యువకులను పెళ్లాడితే రాచరికపు హోదాను మాత్రమే కాకుండా, సంప్రదాయం ప్రకారం రాచ కుటుంబం నుంచి బహుమతిగా వచ్చే సుమారు రూ.9 కోట్లను మాకో తిరస్కరించింది.













