ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఉభయ దేశాల దౌత్యపరమైన సంబంధాలు ప్రారంభమై 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా తాను భారత్లో పర్యటించనున్నట్లు బెన్నెట్ తెలిపారు. రాజకీయ ప్రముఖుల ఫోన్ సంభాషనల్ని టాప్ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి కేంద్రం పెగసస్ స్పైవేర్ కొనుగోలు చేసిందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్ ప్రధాని పదవిని చేపట్టిన బెన్నెట్ తొలిసారి భారత్లో అధికార పర్యటన జరపున్నారు.













