అంతర్జాతీయ విమాన సర్వీసుల పున:ప్రారంభంపై సౌదీ కీలక ప్రకటన
అంతర్జాతీయ విమాన సర్వీసుల పున: ప్రారంభంపై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. మే 17 నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను ఆ దేశ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేసన్ (జీఏసీఏ) కూడా ధృవీకరించింది. మే 17న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఇంటర్నెషనల్ ఫ్లైట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జీఏసీఏ తన సర్య్కూలర్లో పేర్కొంది. అయితే, కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల విమానాల రాకపోకలపై ప్రత్యేకంగా విధించిన నిషేధం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు సౌదీ ఎయిర్పోర్టుల నుంచి సర్వీసులు నడిపే విమానయాన సంస్థలకు జీఏసీఏ సందేశాలు కూడా పంపినట్లు సమాచారం.













