గూగుల్ బాటలో ఇంటెల్… అవసరమైతే ఉద్యోగం నుంచి కూడా
ఇంటెల్తోపాటు పలు కంపెనీలు గ్లోబల్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ బాటపట్టాయి. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుంటే వేతనంలో కోత, అవసరమైతే ఉద్యోగం నుంచి కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులను తొలగిస్తామని ఇటీవలే ఉద్యోగులకు గూగుల్ హెచ్చరించింది. తాజాగా అదే బాటలో సెమీకండక్టర్ల తయారీ కంపనీ ఇంటెల్ చేరింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వివరాల్ని సమర్పించాలని, లేనిపక్షంలో వేతనం లేని సెలవులపై ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఒక వేళ వ్యాక్సిన్ వేయించుకోకుండా మినహాయింపులు అవసరమైన వారి సరైన ధృవీకరణ పత్రాల్ని సమర్పించాలని కోరింది. వైద్య, మతపరమైన కారణాలు మాత్రమే మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇతర కారణాలను అంగీకరించబోమని ఉద్యోగులకు జారీ చేసిన మెమోలో ఇంటెల్ పేర్కొంది. వ్యాక్సిన్ నిబంధనలను అతిక్రమిస్తే మూడు నెలలపాటు జీతాలు ఇవ్వబోమని, అప్పటి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే ఉద్యోగిని తొలగించే దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెచ్ క్రిస్టీ పాంబియాంచీ తెలిపారు.













