చర్చలతోనే ఉక్రెయిన్-రష్యా సమస్య పరిష్కారం : రాష్ట్రపతి
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. తుర్క్మెనిస్థాన్ పర్యాటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ రాజధాని నగరం అష్గబట్ లోని ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యుధ్దాన్ని ఆపాలని భారత్ ముందు నుంచి కోరుతోందని.. ఈ డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చర్చలతోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి పరిష్కారమంటుందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌కు భారత్ మనవతా సహాయాన్ని అందజేస్తోందని, దీన్ని కొనసాగిస్తామని వివరించారు.













