భారతీయ అమెరికన్ కు ఫారడే అవార్డు
బ్రాడ్ బ్యాండ్ వైర్లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నేట్ సేవలను పొందడానికి కీలకమైన మల్టిపుల్ ఇన్, మల్టిపుల్ ఔట్ (మియో) సాంకేతికత సృష్టికర్త, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఆరోగ్యస్వామి పాల్ రాజ్‌కు లండన్‌లో ఫారడే అవార్డును ప్రదానం చేశారు. అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అవార్డు ఇది.. తమిళనాడులోని పొల్లాచ్చిలో జన్మించిన పాల్ రాజ్ 16 ఏళ్ల వయసులో భారత నౌకాదళంలో చేరి, 25 ఏళ్ల సేవల తరవాత అమెరికాకు వలసవెళ్లి, ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.













