కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… జనవరి 1 నుంచి అమలు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాల్లో కొవిడ్ విజంభణ నేపథ్యంలో చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ నివేదిక తప్పనిసరి చేసింది. కొత్త సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. చైనా, హాంకాంగ్ జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జవరి 1, 2023 నుంచి ఆర్టీ` పీసీఆర్ పరీక్ష నివేదిక తప్పనిసరి. ఆ దేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ వైరస్ నెగెటివ్ (ఆర్టీ-పీసీఆర్) నివేదికను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి అని మాండవీయ వెల్లడించారు. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో అమల్లో ఉన్న 2 శాతం మందికి రాండమ్ పరీక్షల నిబంధనకు ఇది అదనమని పేర్కొన్నారు.













