భారత్ కు శాశ్వత సభ్యత్వానికి మేం వ్యతిరేకం
భద్రతమండలిలో భారత్‌కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్‌ని పాకిస్థాన్ అడ్డుకున్నది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో ప్రసంగిస్తూ సమితిలో సంస్కరణ అవసరమే కానీ, భద్రత మండలి విస్తరణ ఇప్పుడు అనవసరమని అన్నారు. సమితి విస్తరణ కన్నా ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయని అయన అన్నారు. భూతాపం వంటి సమ్యలపై భారత్ ఇరుగుపొరుగు దేశాలకు సాయం అందించాలని ఆయన సూచించారు. భారత్, పాక్‌లు తమ మధ్య చిరకాలంగా అపరిష్కవృతంగా ఉన్న అంశాలను పక్కన పెట్టి ముందుగా భూతాపం అంశంపై కృషి చేయాలని ఆయన సూచించారు. భూతాపం ఇప్పుడు ప్రపంచ దేశాలను పీడిస్తున్న సమస్య అనీ, అన్ని దేశాలూ ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సూచించారు. భారత్‌తో సమస్యలు పరిస్కరించుకోదగినవేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భూతాపం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఒక కూటమిగా ఏర్పడి సాయం అందించే విషయమై సానుకూలంగా స్పందించేట్టు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.













