ఆయన నిర్ణయం నిరాశపర్చింది : బైడెన్
జీ20కి హాజరుకాకూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ వారంలో జరగనున్న సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా డేలావేర్‌లో బైడెన్ స్పందిస్తూ నేను నిరుత్సాహనికి గురయ్యాను, కానీ, నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను అని ముక్తసరిగా పేర్కొన్నారు. కానీ, వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం వెల్లడిరచలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 7-10 మధ్యలో బైడెన్ జీ20 సదస్సు పర్యటన జరుగుతుంది.













