డొనాల్డ్ ట్రంప్ విధానానికి.. జో బైడెన్ స్వస్తి

హెచ్ 1బీ వీసా దరఖాస్తులు తిరస్కరించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ 2018లో డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన విధానాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సర్కారు రద్దు చేసింది. గతంలో నిబంధనల ప్రకారం.. దరఖాస్తు తిరస్కరణకు కారణాలను చెప్తూ అభ్యర్థులకు నోటీసు ఇవ్వాల్సి ఉండేది. పొరపాట్లను సరిచేయడానికి అభ్యర్థులకు అవకాశం లభించేది. నోటీసు విధానాన్ని ట్రంప్ సర్కారు రద్దు చేసింది. అభ్యర్థులు నష్టపోతున్నందున బైడెన్ ప్రభుత్వం నోటీసు విధానాన్ని పునరుద్ధరించింది.