హెచ్ 1 బీ వీసాల లాటరీ రిజిస్ట్రేషన్లలో మోసాలు
హెచ్ 1బీ వీసాదారుల ఎంపిక కోసం ఉపయోగించే కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్లో మోసాలు జరుగుతున్నట్లు అమెరికా గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలింది. దాంతో, హెచ్ 1బి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ సిద్ధమైంది. ప్రతియేటా కొన్ని లక్షల మంది ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుండగా, కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైనవారికి వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ (యుఎస్సిఐఎస్) గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.













