ఈ విషయంలో మేం చాలా జగ్రత్తగా : షోల్జ్
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా ఆయుధాలు పంపితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు. చైనాపై ఆంక్షలు విధించే అవకాశాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు. పర్యవసానాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తున్నాం. ఇందులో మేం విజయం సాధిస్తామనే అనుకుంటున్నాం. ఈ విషయంలో మేం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని షోల్జ్ తెలిపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మధ్యకాంలో జర్మనీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా కావడం. ఈ నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తే చైనాపై ఎలాంటి చర్యలుంటాయన్న విషయాన్ని షోల్జ్ వివరించలేదు.













