వాటర్‌గేట్ కుంభకోణం సూత్రధారి ఇకలేరు
1970లో అమెరికా రాజకీయాలను మలుపుతిప్పిన వాటర్‌గేట్ కుంభకోణం సూత్రధారి గార్డన్ లిడ్డీ 90 ఏండ్ల వయసులో మరణించారు. 1972 జూన్‌లో డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయం వాటర్‌గేట్ బిల్డింగ్‌లోకి రహస్యంగా చొరబడి ఆ పార్టీ రహస్య పత్రాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఎన్నికల్లో విజయం కోసం నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఈ పని చేయించారని ఆరోపణలున్నాయి. ఇదే వాటర్‌గేట్ కుంభకోణంగా పేరొందింది. ఈ స్కామ్ కారణంగా 1974లో నిక్సన్ రాజీనామా చేశారు. గార్డన్ లిడ్డీ నాలుగేండ్లకు పైగా జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యాడు.













