ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్ లో ఉందీ. దీన్ని నిర్మించడానికి అమెరికా ప్రభుత్వం అక్షరాల 400 కోట్ల డాలర్లు (సుమారు రూ.30 వేల కోట్లు) ఖర్చు చేసింది. 2001లో న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా నేలమట్టమైంది. ఆ తర్వాత అదే ప్రదేశంలో కొత్తగా మరో స్టేషన్ నిర్మించాలని భావించారు. 200 కోట్ల డాలర్ల బడ్జెట్‌తో దీనిని నిర్మించాలని అనుకున్నా. అది కాస్తా పూర్తయ్యే సరికి రెట్టింపు ఖర్చయింది. దీనిని నిర్మించడానికి ఏకంగా 12 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అత్యంత సుదీర్ఘకాలం నిర్మించిన రైల్వే స్టేషన్ ఇదే. 2004లో మొదలుపెడితే.. 2016లో పూర్తయింది. ఈ స్టేషన్ పేరు ఒకులస్. ఇదొక పక్షి పేరు. స్టేషన్ కూడా అదే ఆకారంలో నిర్మించారు కాబట్టి దీనికా పేరు పెట్టారు. ప్రతి రోజూ రెండున్నర లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.













