పెళ్లితో ఒక్కటైన మహిళా క్రికెటర్లు
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులో వారిద్దరూ కీలక ఆటగాళ్లు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. వారే కేథరిన్ బ్రుంట్, నాట్ స్కీవర్. గత వారమే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లండ్ జట్టు 2017 ప్రపంచ కప్ గెలుపొంందడంలో ఇరువురు కీలక పాత్ర పోషించారు. 2022 ప్రపంచ కప్ సభ్యులు కూడా జట్టుగా వైస్ కెప్టెన్గా స్కీవర్ ఉంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇసా గుహా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మిమ్మల్ని చూస్తూ గర్వంగా ఉంది. లవ్ యూ అంటూ అభినందించింది. ఈ జంటకు క్రికెట్ ఇంగ్లండ్ కూడా అభినందనలు తెలిపింది. అధికారిక ట్విట్టర్లోనూ వీరి ఫోటోలను పోస్టు చేసి పెళ్లి చేసుకున్న కేథరిన్, నాట్ స్కీవర్లకు మా హృదయ పూర్వక అభినందనలు అని రాసుకొచ్చింది.













