ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డీ, ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లు నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్ కార్డ్‌కు సగం పురస్కారం దక్కగా, మరో ఇద్దరు సగం ప్రైజ్‌మనీ పంచుకోనున్నారు. లేబర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. అమెరికాలోని బెర్క్లే లో ఉన్న కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్‌కు సగం బహుమతి దక్కనున్నది. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్ కొన్ని సూచనలు చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జాషువా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గైడో ఇంబెన్స్‌లు క్యాజువల్ రిలేషన్షిప్ప్ను విశ్లేషించారు.













