రెండు దేశాల సంబంధాల వృద్ధికి కృషి : బైడెన్ హామీ
ద్వైపాక్షిక సంబంధాలను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు హామీ ఇచ్చారు. 1979లో ఇరు దేశాల మధ్య మొదలైన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 45 ఏళ్లవుతున్నాయి. ఈ సందర్భంగా బైడెన్, జిన్‌పింగ్‌లు పరస్పరం అభినందన సందేశాలు పంపుకొన్నారు. తాజాగా పంపిన సందేశంలో జిన్‌పింగ్ శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణయాలను అమలుకు పూనుకోవాలని బైడెన్‌ను కోరారు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఉభయతారక సహకారం ఆధారంగా చైనా అమెరికా సంబంధాలు పురోగమించాలని పిలుపు ఇచ్చారు. దానికి బదులుగా బైడెన్ రెండు దేశాల సంబంధాల వృద్ధికి బాధ్యతాయుతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.













