న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా జసిందా అర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజిలాండ్ గవర్నర్ `జనరల్ సిండి కిరో, కొద్దిమంది స్నేహితులు, సహచరుల సమక్షంలో క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్తి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ ఈ సందర్బంగా వాగ్దానం చేవారు. 2008లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన 2020 లో కోవిడ్`19, పోలీస్‌శాఖ మంత్రిగా నియమితులయ్యారు.













