కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే!

చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చిందా? ఇందుకు అవకాశాలున్నాయా? అన్న ప్రశ్నలకు ఆ అవకాశాలున్నాయని అమెరికాలోని వైద్య నియంత్రణ సంస్థ సెంటర్స్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రోచల్ వాలెన్‍స్కీ చెప్పారు. బడ్జెట్‍పై చర్య సందర్భంగా ఆమె.. అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా లూసియానా సెనేటర్ జాన్ కెన్నెడీ.. కరోనా పుట్టుకపై ప్రశ్నించారు. దీనికి వాలెన్‍స్కీ అవును వచ్చే అవకాశం ఉంది అని బదులిచ్చారు. ఇదిలా ఉండగా, వైరస్ వ్యాప్తిపై రిపబ్లికన్లు సొంత నివేదికను రూపొందించారు. కరోనా వైరస్ చైనాలో వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు.