వారు నిర్దోషులు.. రూ.550 కోట్ల పరిహారం!

అమెరికాలో చేయని నేరానికి మూడు దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించిన ఇద్దరు సోదరులకు 75 మిలియన్ డాలర్లను (రూ.550 కోట్లు) పరిహారంగా ఇవ్వాలని నార్త్ కరోలినా కోర్టు తీర్పునిచ్చింది. 1983లో 11 ఏండ్ల బాలికను రేప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తూ హెన్రీ మెక్‍కాలమ్, లియోన్ బ్రౌన్ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. అయితే 2014లో చేసిన డీఎన్‍ఏ పరీక్షల్లో అసలు నిజం బయటపడింది. బాలిక కేసులో వీరు నిర్దోషులని న్యాయస్థానం తేల్చింది. చేయని తప్పుకు ఇంతకాలం శిక్ష అనుభవించామని, విచారణ పేరుతో మానసిక, శారీరక హింసకు గురయ్యామని మరుసటి ఏడాది ఆయన సోదరులు నార్త్ కరోలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని వాదించారు. దీంతో న్యాయస్థానం ఇరువురికీ రూ.550 కోట్ల పరిహారాన్ని ఇవ్వాలని తీర్పునిచ్చింది.