అమెరికా శాస్త్రవేత్తలు మరో ఘనత
పర్యావరణ హిత ప్లాస్టిక్ తయారీ దిశగా అమెరికాలోని బోయిస్ స్టేట్ యూనివర్సిటీ చెందిన శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. పర్యావరణానికి నష్టం చేసే పాలిస్టైరిన్ స్థానంలో ఇథైల్ సైనోయాక్రిలేట్ను వినియోగించి తయారు చేసే సూపర్ గ్లూతో కొత్త రక్తమైన ప్లాస్లిక్‌ను తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు అల్లిసన్ క్రిస్టీ, స్కాట్ ఫిలిప్స్ పేర్కొన్నారు. ఇథైల్ సైనో యాక్రిలేట్ను కార్బన్ డయాక్సైడ్ నుంచి ఉత్పత్తయ్యే ఫార్మాల్డిహైడ్తో తయారు చేయవచ్చని తెలిపారు. ఇతర ప్లాస్టిక్‌లా దీని తయారీకి క్రూడ్ ఆయిల్, దాని ఉప ఉత్పత్తులను వినియోగించాల్సి అవసరం లేదన్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఏటా 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలోకి చేరుతున్నది.













