బిల్ గేట్స్ పెళ్లి.. మళ్లీ ఆమెతోనే!
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని అంటూన్నారు. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ దంపతులు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2021లో ఆగస్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి తన జీవితం విచిత్రంగా అనిపిస్తోందని బిల్ గేల్స్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓవైపు కరోనా, మరోవైపు మెలిండాతో విడాకులు, పిల్లలు కూడా ఇంటినుంచి వెళ్లిపోవడంతో జీవితం అసహజంగా ఉందన్నారు. మెలిండాతో వైవాహిక జీవితం గొప్పగా సాగిందని, ప్రస్తుతం ఆమెతో విడిపోయినా వృతి పరంగా మాత్రం ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని తెలిపారు. మరొకరిని రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదన్నారు. మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటా అని అన్నారు.













