గేట్స్ ఫౌండేషన్ మరో 10 వేల కోట్లు విరాళం
సామాజిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ మరో 1.27 బిలియన్ డాలర్లు (రూ.10వేల కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ దాతృత్వ సంస్థ ఏటా నిర్వహించే వార్షిక సమావేశం న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్లో ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన అధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన గోల్‌కి పర్స్ నివేదికలో గేట్స్ ఫౌండేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. 2030 నాటికి సాధించిన ఐరాస నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ప్రతి అంశంలో దారితప్పుతున్నామని తెలిపింది. వీటిని గాడిన పెట్టేందుకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాల వినూత్న పరిష్కార మార్గాలతో లక్ష్యాల సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొంది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కొనసాగించేందుకు తాజా ఆర్థిక సహాయాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది.













