ఇది ఆలోచించాల్సిన తీవ్రమైన అంశం : రిషి సునాక్
బ్రిటన్ ఎంపీలు తమ విదేశీ పర్యటనల్లో వ్యభిచారుల దగ్గరకు వెళ్తారని, మితిమీరి మద్యపానం చేస్తారని వచ్చిన వార్తలపై ప్రధాని రిషి సునాక్ స్పందించారు. ఇది ఆలోచించాల్సిన తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ( ఏపీపీజె) చేపట్టే విదేశీ పర్యటనల్లో ఎంపీలు ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ కన్జర్వేటివ్ ఎంపీ తన పర్యటించిన ఓ ఆగ్నేయా దేశంలో వ్యభిచార గృహాలు ఎక్కడున్నాయో వాకబు చేశారు. అధికారిక పర్యటన ముగిసినా ఆ విషయమై అక్కడే కొన్ని రోజులు ఉండిపోయారు.













