తెలుగు మహిళ అరుదైన అవార్డు
యూకేలోని కెంట్ ప్రాంతంతో నివసించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిమవల్లి చలికొండ అరుదైన అవార్డును అందుకున్నారు. ఐఐడబ్ల్యూయషీ ఇన్స్సెయిర్ అవార్డ్స్ 2022లో ప్రతిష్టాత్మకమైన ఇన్స్పెయిరింగ్ ఇండియన్ ఉమెన్ గ్లోబల్ అవార్డును కమ్యూనిటీ స్పిరిటీ విభాగంలో ఈ నెల 23న యూకేలోని హౌస్ ఆఫ్ పార్లమెంట్లో హిమవల్లి అందుకున్నారు. పలు సంవత్సరాలు నుంచి అభ్యర్థులు చేస్తున్న నిర్విరామ కృషి ఆధారంగా ఈ అవార్డును అందిస్తారు. చివరి రౌండ్లో ఆమె మూడో స్థానంలో నిలిచి ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. హిమవల్లి మాట్లాడుతూ 2006 నుంచి తెలుగువారి కోసం సోషల్ మీడియా ద్వారా ఓ కమ్యూనిటీని స్థాపించి భారత్ నుంచి యూకే వచ్చే వారికోసం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీలో 9 వేల మంది సభ్యులున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత, ఇండియాలో వదరలు సంభవించినప్పుడు పేదల ఆర్థిక అండకు, ఒంటిరి మహిళల సహాయార్థం గ్రూపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి వివిధ రంగాల నుంచి 150 నామినేషన్లు రాగా ప్రతిభ ఆధారితంగా హిమవల్లికి దక్కింది.













