అమెరికాలో 17 మంది అరెస్టు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో గురుద్వారా సహా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పులు ఘటనలకు సంబంధించి అధికారులు 17 మందిని అరెస్టు చేశారు. వివిధ దర్యాప్తు సంస్థలు మొత్తం 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అరెస్టైనవారిలో ఎక్కువ మంది స్థానిక సిక్కు సమాజానికి చెందినవారేనని వెల్లడిరచారు. గతేడాది ఆగస్టు 27న స్టాక్టన్ నగరంలోని సిక్కు ఆలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనతో, గత నెల 23న శాక్రమెంటో గురుద్వారాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన సహా వివిధ కాల్పుల ఘటనలతో అరెస్టైన వారికి సంబంధం ఉన్నట్లు తెలిపారు. సోదాల సందర్భంగా అధికారులు ఓ మెషీగన్, ఒక ఏకే-47, పలు హ్యాండ్ గన్నులు సహా మొత్తం 42 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.













