తానా – “నారీ – సాహిత్య భేరి”

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా “నారీ – సాహిత్య భేరి” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తునట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లురి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
డా. ప్రసాద్ తోటకూర మరిన్ని వివరాలు తెలియజేస్తూ – ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవయిత్రులు పాల్గొనవచ్చని, “కుటుంబంలోను,సంఘంలోను విజయానికి ప్రతీక – స్త్రీ” అనే ఇతివృత్తం పై రచన చేసి స్వయంగా మూడు నిమిషాలకు మించకుండా పాటగాని, గేయాన్ని గాని పాడి అక్టోబర్ 10వ తేది లోపు ఆ వీడియోను తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కు వాట్సాప్ ద్వారా +91-9121081595 కు పంపవలెను .
ఎంపికైన వారికి అక్టోబర్ 25న జరిగే తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రత్యేక కార్యక్రమంలో పాడే అవకాశం కలుగుతుంది. పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి. మరిన్ని వివరాలకు www.tana.orgను సంప్రదించవచ్చు