గుడ్ న్యూస్.. అతి త్వరలో పిల్లలకు!

దేశంలో త్వరలోనే 12 ఏళ్లుపైబడిన పిల్లలకు కొవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో పాటు పెద్దల కోసం జైడస్ క్యాడిలా జైకోవ్-డీ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసింది. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెల 20న అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రీఫింగ్‌లో హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ జైడస్ వ్యాక్సిన్‌ను అతిత్వరలో జాతీయ టీకా డ్రైవ్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా తేదీ నిర్ణయించలేదని అన్నారు.